Header Banner

సచివాలయ ఉద్యోగులపై తాజా నిర్ణయం.. నియామక బాధ్యతలు వారీకే! ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ!

  Fri Apr 11, 2025 09:50        Politics

ఏపీ ప్రభుత్వం సచివాలయాల ప్రక్షాళన ప్రారంభించింది. కొంత కాలంగా చేస్తున్న కసరత్తులో భాగంగా తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాలను మూడు కేటగిరిలుగా విభజిస్తూ నిర్ణయం తీసుకుంది. జనాభా ప్రాతిపదికన వర్గీకరణ చేసింది. సిబ్బంది కేటాయింపుల పైన స్పష్టత ఇచ్చింది. ఇదే సమయంలో ఉద్యోగుల నుంచి వస్తున్న అభ్యర్ధనల మేరకు ఫీల్డ్ విధుల నుంచి సమస్యలు ఉన్నవారిని తప్పిస్తూ వెసులుబాటు కల్పించింది. తాజా నిర్ణయం మేరకు సిబ్బంది నియామక బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించారు.

తాజా ఉత్తర్వుల్లో
ఏపీ ప్రభుత్వం సచివాలయాల విభజన పైన మార్గదర్శకాలు జారీ చేసింది. సచివాలయాలను ఎ, బ, సి కేటగిరీలుగా విభజిస్తున్నట్లు అందులో పేర్కొంది. 2500లోపు జనాభా ఉన్న సచివాలయా లకు ఇద్దరు, 2501 నుంచి 3500 వరకు జనాభా ఉన్న సచివాలయాలకు ముగ్గురు సిబ్బందిని కేటాయించింది. అంతకంటే ఎక్కువ జనాభా ఉంటే నలుగురు సిబ్బందిని కేటాయిస్తున్నట్లు తెలిపింది. వివిధ శాఖల కార్యదర్శులను ఆయా సచివాలయాలకు సర్దుబాటు చేయాలని నిర్ణయిం చింది. కార్యదర్శులకు సాధారణ విధులు కేటాయిస్తున్నట్లు తెలిపింది. గ్రామ వార్డు సచివాలయా ల్లోని మల్టీపర్పస్‌ ఫంక్షనరీస్‌ను జనరల్‌ పర్పస్‌గానూ, టెక్నికల్‌ ఫంక్షనరీస్‌ను స్పెషిఫిక్‌ ఫంక్షన రీస్‌గానూ మార్పు చేశారు. ఉత్తర్వుల ప్రకారం ఆయా జిల్లాల కలెక్టర్లు సచివాలయ సిబ్బంది వివరాలను సిద్ధం చేయాలని స్పష్టం చేసింది.

ప్రక్షాళన దిశగా
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసు కుంది. ఏ-కేటగిరీ సచివాలయాల్లో మల్టీపర్పస్‌ సిబ్బంది ఇద్దరు, టెక్నికల్‌ సిబ్బంది నలుగురు కలిపి మొత్తం ఆరుగురిని నియమించనున్నారు. బీ-కేటగిరీ సచివాలయాల్లో మల్టీపర్పస్‌ సిబ్బం ది ముగ్గురు, టెక్నికల్‌ సిబ్బంది నలుగురితో కలిపి ఏడుగురు, సీ-కేటగిరీ సచివాలయాల్లో నలు గురు మల్టీపర్పస్‌ సిబ్బంది, నలుగురు టెక్నికల్‌ సిబ్బంది కలిపి మొత్తం 8 మందిని నియమి స్తారు. మల్టీపర్పస్‌/ సాధారణ అవసరాలకు సంబంధించి గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌ 1-5, డిజిటల్‌ అసిస్టెంట్‌, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ అసిస్టెంట్‌, గ్రామ మహిళా పోలీసు, వార్డు సచివాలయాల్లో అడ్మినిస్ట్రేటివ్‌ కార్యదర్శి, ఎడ్యుకేషన్‌ అండ్‌ డేటా ప్రాసెసింగ్‌ కార్యదర్శి, వెల్ఫేర్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ కార్యదర్శి, మహిళా పోలీసును నియమిస్తారు.

కలెక్టర్లకు బాధ్యతలు
ప్రత్యేక/ టెక్నికల్‌ సిబ్బందికి సంబంధించి గ్రామ సచివాలయాల్లో విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్‌, ఏఎన్‌ఎం, సర్వే అసిస్టెంట్‌, ఇంజనీర్‌ అసిస్టెంట్‌, అగ్రికల్చర్‌/హార్టీకల్చర్‌/సెరికల్చర్‌ అసిస్టెంట్‌, వెటర్నరీ/ఫిషరీస్‌ అసిస్టెంట్‌, ఎనర్జీ అసిస్టెంట్‌ను, వార్డు సచివాలయాల్లో వార్డ్‌ రెవెన్యూ కార్యదర్శి, హెల్త్‌ సెక్రటరీ, ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌ కార్యదర్శి, అమెనిటీస్‌ కార్యదర్శి, శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ కార్యదర్శి, ఎనర్జీ కార్యదర్శులను నియమిస్తారు. ఏ సచివా లయం ఏ కేటగిరీలో ఉందో, అందులో ఎంతమంది సిబ్బందిని ఏర్పాటు చేస్తారనే జాబితాను గ్రామ, వార్డు సచివాలయ శాఖ విడుదల చేసింది. ఆయా కేటగిరీలకు సంబంధించి సచివాల యాల్లో సిబ్బంది నియామకాలపై జిల్లా కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. అమరావతిలో ఇ-13, ఇ-15 కీలక రహదారుల విస్తరణ! అక్కడో ఫ్లైఓవర్ - ఆ ప్రాంతం వారికి పండగే!

 

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APGovernment #SecretariatStaff #NewOrders #APNews #VillageSecretariats #WardSecretariats